భారీ వర్షాలు.. 107 ఏళ్ల రికార్డు బద్దలు

ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. నగరంలో ఇప్పటివరకు 135 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షం 107 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిందని వాతావరణశాఖ తెలిపింది. వరదల కారణంగా అండర్ పాస్‌ల వద్ద బస్సులు, కార్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు.