చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

VZM: గంట్యాడ మండలం నరవ గ్రామ సమీపంలో ఉన్న ఎర్ర చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం చెరువులో బోర్లపడి తేలుతూ ఉండడం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించలేకపోతున్నారు. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. లేదా మరి ఏమైనా కారణమా అన్న విషయం తెలియాల్సి ఉంది.