హైదరాబాద్‌కు పయనమైన ఆక్వా రైతులు
W.G: "ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్‌పో హైదరాబాద్" సదస్సుకు జిల్లా నుండి 40 మంది ఆక్వా రైతులు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టూరిస్ట్ బస్సును కలెక్టర్ సి.నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక ఆక్వా పద్ధతులు, మార్కెట్ అవకాశాలపై అవగాహన పొందాలని రైతులకు సూచించారు.