పొట్టిపాడు టోల్ ప్లాజాను సందర్శించిన పోలీసులు

పొట్టిపాడు టోల్ ప్లాజాను సందర్శించిన పోలీసులు

కృష్ణా: ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజాను గన్నవరం ఎస్‌డీపీవో శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. ప్రస్తుతం టోల్‌లో 20 సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే వాహన డ్రైవర్ల ముఖచిత్రాలు, ద్విచక్రవాహనదారుల వివరాలు స్పష్టంగా రికార్డు కావాలంటే కేబిన్‌ల వద్ద కనీసం 8 అదనపు కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.