విడదల రజినిని కలిసిన అంబటి రాంబాబు
AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు YCP నేత విడదల రజినిని కలిసి ధైర్యం చెప్పారు. నరసరావుపేట ఘటన దురదృష్టకరమని, తనపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని వదిలేది లేదని, పోలీసు వ్యవస్థ దిగజారిందని మండిపడ్డారు. అమరావతి పూర్తవుతుందనే నమ్మకం తనకు లేదని వ్యాఖ్యానించారు. 'మీరు చట్టం తెచ్చినప్పుడు వేరేవాళ్లు తేలేరా' అంటూ నిలదీశారు.