ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సూర్యాపేట మండలం హనుమనాయక్ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు.