ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
MHBD: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, ఐదు మండల కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమైంది. మహబూబాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఈ రోజు ఉదయం పరిశీలించారు. అధికారుల పలు సూచనలు చేశారు.