జిల్లా కేంద్రంలో BJP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
MLG: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ములుగులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బాలరాం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “పార్టీ కంటే దేశం ముఖ్యం” అంటూ పార్టీ సిద్ధాంతాన్ని వివరించారు. జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.