'వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: ఒంగోలులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం జిల్లా వైద్య అధికారులతో డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం చేయాలని అధికారులను సూచించారు. నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయన్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.