సీఎం రిలీఫ్‌ ఫండ్ అందజేత

సీఎం రిలీఫ్‌ ఫండ్ అందజేత

VSP: విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పీ. విష్ణుకుమార్‌ రాజు తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 24, 25, 43, 54వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు సుమారు రూ. 4.84 లక్షల చెక్కులు అందజేశారు.