ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలి

NLG:హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్, చిన్న చిన్న బడ్డీ కోట్లు తదితర ప్రదేశాలలో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రతపై జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.