పోగొట్టుకున్న బంగారు వస్తువు అప్పగింత

పోగొట్టుకున్న బంగారు వస్తువు అప్పగింత

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో మూడు రోజుల క్రితం ఆటోలో పోగొట్టుకున్న 20 గ్రాముల బంగారు డాలర్‌ను పోలీసులు మంగళవారం రికవరీ చేశారు. లక్ష్మీహాల్ ప్రాంతానికి చెందిన బాషా నవరంగ్ సర్కిల్ వద్ద ఆటోలో ప్రయాణిస్తుండగా అతని బ్యాగులో నుంచి బంగారు డాలర్ జారిపోయింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి, ఆటోను, ప్రయాణించిన వ్యక్తులను గుర్తించారు.