పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామ పొలాలలో పేకాట శిబిరాలపై ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ.2510 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట, జూదం వంటివి ఆడితే వెంటనే సమాచారం అందజేయాలని తెలిపారు.