ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

విజయనగరం: ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని బొబ్బిలి పట్టణంలో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్ధనలో అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు, సోదరిమానులు పాల్గొన్నారు.