పలాసలో భారీ చోరీ
SKLM: పలాసలో భారీ చోరీ కలకలం రేపింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాపులోకి ముఖానికి ముసుగులు ధరించిన ఎనిమిది మంది దుండగులు చొరపడ్డారు. ఈ క్రమంలో షాపు యజమాని రామకృష్ణ చేతులకు సంకెళ్లు వేసి, ఆయన్ని బంధించి షాపులోని భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.