ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLG: మిర్యాలగూడ మండలం కేశవపురం, రామోజీ తండాలో నూతన ఇందిరమ్మ ఇళ్ళను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు వారి కుటుంబసభ్యులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వంలో రెండున్నర ఏళ్ళలో నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.