VIDEO: నగరంలో మరో అగ్ని ప్రమాదం
HYD: అత్తాపూర్ పరిధి బుద్వెల్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. AKR పెట్రోల్ బంక్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుందటంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.