జిల్లాలోని రైల్వే స్టేషన్లో కొత్తగా 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్
KDP: ప్రయాణికుల సౌకర్యార్థం జిల్లాలోని రైల్వే స్టేషన్లో కొత్తగా 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కడప MP వైయస్ అవినాశ్ రెడ్డి వినతి మేరకు పూణే - కన్యాకుమారి - పూణే (16381/82) మధ్య తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొండాపురంలో ఒక నిమిషం పాటు ఆగనుంది. (17622) తిరుపతి - ఔరంగాబాద్ రైలుకు ఎర్రగుంట్లలో స్టాపింగ్ కల్పించారు.