పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని అభినందించిన కేంద్ర మంత్రి
SRCL: నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం సిరిసిల్ల కార్యవర్గాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లోని తన నివాసంలో ఇవాళ శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత అన్నల్ దాస్ వేణు, సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు డా. గాజుల బాలయ్య, మోర రవి, క్యాషియర్ యెల్లే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్ పాల్గొన్నారు.