యాడికిలో వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం
ATP: యాడికి మండల కేంద్రంలో శ్రీ శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మరథోత్సవం కన్నుల పండువగా సాగింది. గోవింద నామస్మరణతో పురవీధులు మార్మోగగా, వేలాదిమంది భక్తుల నడుమ రథం కదిలింది. రథం ముందు హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.