19వ రోజుకు చేరిన దీక్ష.. స్పందించని అధికారులు

కోనసీమ: ఎండ, వాన అనే తేడా లేకుండా మండపేట కేశవరంలో రిలే నిరాహారదీక్ష చేస్తున్నా.. అధికారుల్లో కనీసం స్పందన లేదని గ్రామానికి చెందిన వల్లూరి శ్రీవాణీ ఆరోపించారు. ఆమె చేపట్టిన రిలే దీక్ష ఇవాల్టికి 19వ రోజుకు చేరింది. కాగా, గ్రామంలోని హైస్కూల్ ప్రహరీ గోడ తక్షణమే నిర్మించాలని కోరుతూ ఆమె దీక్ష చేస్తున్నారు.