VIDEO: రాంచీ వీధుల్లో ధోనీ చక్కర్లు

VIDEO: రాంచీ వీధుల్లో ధోనీ చక్కర్లు

టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీకి కార్లు, బైక్‌లు అంటే పిచ్చి. కొత్తగా మార్కెట్‌లోకి ఏ వాహనం వచ్చినా తన గ్యారేజీలోకి చేరాల్సిందే. తాజాగా, ఇండియన్ ఆర్మీ థీమ్‌తో ఉన్న బీస్ట్ కారులో చక్కర్లు కొడుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బీస్ట్ కారు ధర రూ.75 లక్షలు ఉంటుంది. దీని మాడిఫికేషన్ కోసం మరో రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చు అయినట్లు సమాచారం.