యువతకు ఎస్పీ కృష్ణారావు హెచ్చరిక

యువతకు ఎస్పీ కృష్ణారావు హెచ్చరిక

పల్నాడులోని యువత బెట్టింగుకు దూరంగా ఉండాలని ఎస్పీ కృష్ణారావు శుక్రవారం సూచించారు. బెట్టింగు ఒక ప్రమాదకర వ్యసనమని ఇది ఆర్థిక పరిస్థితి కుటుంబ జీవితం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బెట్టింగ్ వల్ల డబ్బు నష్టం, అప్పులు, మానసిక ఒత్తిడి, వంటి సమస్యలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్‌లో పాల్గొంటే చర్యలు తీసుకుంటామన్నారు.