ఉదయాన్నే తేనె కలిపిన నిమ్మరసం తాగితే?
ఉదయాన్నే తేనె కలిపిన నిమ్మరసం తాగితే శరీరం నుంచి విష పదార్థాలను సులభంగా బయటకు పంపడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్‌తో పాటు విటమిన్ సి ఉంటుంది. ఈ సమ్మేళనాలు లివర్ పనితీరుకు మద్దతు ఇస్తాయి. పేగులను శుభ్రపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడం వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.