రైలు ప్రయాణికులకు రిలీఫ్

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు(CBE), ధన్‌భాద్ (DHN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 9 నుంచి 23 వరకు CBE-DHN (నం.06063) ప్రతి శుక్రవారం, మే 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం DHN-CBE(నం. 06064) రైళ్లు నడుపుతామన్నారు. కాగా, ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, ఒంగోలు, నెల్లూరుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.