రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
కోనసీమ: రాజోలు మండలంలోని చింతలపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సదరు వ్యక్తి చింతలపల్లి నుంచి జాతీయ రహదారిపైకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.