లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డికి బెయిల్

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డికి బెయిల్

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు రోనక్ కుమార్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్ 21న అరెస్ట్ అయిన కేసిరెడ్డి దాదాపు సంవత్సర కాలంగా జైలులోనే ఉన్నారు. గతంలో పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేసినా.. న్యాయస్థానం తిరస్కరిస్తూ వచ్చింది.