VIDEO: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

SDPT: దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బుడగ జంగం కాలనీకి చెందిన పత్రి మల్లవ్వ(85) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లవ్వ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై అరుణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.