డ్రగ్స్ వద్దు.. లక్ష్యాలు ముద్దు: మున్సిపల్ కమిషనర్
ఎన్టీఆర్: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని తిరువూరు మున్సిపల్ కమిషనర్ మనోజ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 12న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న దండి మార్చ్ 2.0 కరపత్రాలను మనోజ శనివారం ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు అయితే అంధకారం అన్నారు.