'అధికారులు స్పందించే వరకు దీక్ష కొనసాగింపు'

'అధికారులు స్పందించే వరకు దీక్ష కొనసాగింపు'

E.G: గోకవరం మండల కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన దేవీపట్నం గ్రామస్తులు చేస్తున్న నిరాహార దీక్ష శనివారానికి ఐదవ రోజుకు చేరుకుంది. ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ అధికారుల, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే దీక్షను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.