ఘనంగా అనభేరి ప్రభాకర్ రావు జయంతి వేడుకలు

MNCL: మంచిర్యాల బైపాస్ రోడ్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమర యోధుడు అనభేరి ప్రభాకర్ రావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అనభేరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమసమాజ స్థాపన, పేద ప్రజల విముక్తి కోసం తుదిశ్వాస వరకు అనభేరి పోరాడారని తెలిపారు.