ఇందిరమ్మ ఇళ్లు నిలిపివేతపై హైకోర్టుకు మహిళ
BHPL: గోరికొత్తపల్లి (M) కొత్తపల్లికి చెందిన ఓ మహిళకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్‌ను కక్షపూరితంగా నిలిపివేశారని ఆరోపిస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అన్ని అర్హతలున్నప్పటికీ MLA, అధికారులు ఇళ్లు ఆమోదం రద్దు చేశారని, ఎలాంటి కారణాలు చెప్పకుండా నోటీసులు ఇవ్వడం లేదన్నారు. RTI ద్వారా సమాచారం సేకరించిన ఆ మహిళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.