అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

W.G: ధాన్యం లోడుతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పంట కాలువలో పడింది. సోమవారం వీరవాసరం పశ్చిమకాలువ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మెంటేపూడి నుంచి వీరవాసరం వైపు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ రహదారి మార్జిన్లో అదుపుతప్పి పంట కాలవలో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్‌‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.