రోజా వ్యాఖ్యలపై ఖండవల్లి లక్ష్మి ఆగ్రహం
E.G: ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబాలపై రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ మహిళా నేత ఖండవల్లి లక్ష్మి తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మహిళలను కించపరిస్తే ఉపేక్షించబోమని అన్నారు. గతంలో వైసీపీ మంత్రుల ప్రవర్తనను ప్రజలు మర్చిపోలేదని, ఇలాంటి తీరు మార్చుకోవాలని సూచించారు.