లోలుగులో ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

లోలుగులో ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

SKLM: పొందూరు మండలం లోలుగు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలకు హెచ్ఎం విజయబాల మాట్లాడుతూ.. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.