70 మందికి ఉచిత వైద్య పరీక్షలు

70 మందికి ఉచిత వైద్య పరీక్షలు

ATP: విశ్వహిందూ పరిషత్, కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో తగరకుంటలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 70 మందికి పరీక్షలు చేయగా, ఇందులో 45 మందిని ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సర్పంచ్ మాధవరాజు, గోవింద రాజులు, సదానందం రెడ్డి పాల్గొన్నారు.