బంగారం చైన్ విషయంలో ఫిర్యాదు.!

బంగారం చైన్ విషయంలో ఫిర్యాదు.!

ప్రకాశం: ఒంగోలులోని ఓ బంగారు షాపులో కొత్త బంగారు చైన్ తయారు చేయిస్తానంటూ షాపు యజమాని మోసం చేసినట్లు ఓ మహిళ సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. బంగారం షాపులో కొత్త చైను కోసం రూ.3 లక్షల నగదు చెల్లించి, పాత చైన్ కూడా అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళ ఫిర్యాదు చేశారు.