VIDEO: యూరియా కోసం రైతుల ఆందోళన

MLG: జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు క్యూలైన్‌లో నిలబడి టోకెన్ తీసుకున్నా, రాత్రి 7 గంటల వరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిక లేక పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధికారులు స్పందించి, సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.