విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే
SS: నల్లమాడ మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను MLA పల్లె సింధూర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తీరును ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడకూడదని నిర్వాహకులకు సూచించారు.