లారీ, బైక్ ఢీకొని ఒకరు స్పాట్ డెడ్
JGL: కోరుట్ల జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల నుంచి జగిత్యాల వైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.