ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

NRPT: మరికల్ మండలంలోని కన్మనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. పాఠశాల హెచ్ఎ గా గౌతమి, జిల్లా కలెక్టర్‌గా మధుప్రియ, డీఈవోగా భవాని, ఎంఈవోగా అక్షర వ్యవహరించారు. ఉత్తమంగా బోధన చేసిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చినట్లు పాఠశాల హెచ్ఎం నర్మద తెలిపారు. ఈ కార్యక్రమంలో అలివేలు, నాగమణి, భారతి, రవీందర్ పాల్గొన్నారు.