రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

KDP: ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ పెన్నా నది బ్రిడ్జి మధ్యన ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి సోమవారం మృతి చెందాడు. నంద్యాల-రేణిగుంట మధ్య నడిచే డెమోరైల్ కింద పడి చనిపోయినట్లు సమాచారం. ఇతని వయసు 53 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. మృతుడు శరీర భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. మృతుని ఆచూకీ తెలిసినవారెవరైనా ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.