జిల్లాలో ప్రమాదం.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు
నంద్యాల జిల్లా ఆత్మకూరు శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో కీర్తి (12) ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా కామనదొడ్డి గ్రామానికి చెందిన వలస కార్మికులు బొలెరో వాహనంలో గుంటూరు వెళ్తుండగా రాంగ్ రూట్లో వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.