నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
: కొమరోలు మండలంలో ఆర్ డి ఎస్ ఎస్ పనులు చేస్తున్న నేపథ్యంలో రెడ్డిచర్ల ఫీడర్లోని పామూరు పల్లె గ్రామానికి ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.