VIDEO: కంభంలో నిర్మానుష్యంగా రహదారులు
ప్రకాశం: కంభం పట్టణంలో మండుతున్న ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. బుధవారం పట్టణంలో సుమారు 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు.