బారిఎత్తున పోస్తున్న మత్తడి.. నిలిచిన రాకపోకలు

MHBD: బయ్యారం మండలం పెద్ద చెరువు కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం ఐదు అడుగుల ఎత్తున మత్తడి పోస్తోంది. పోలీసులు చెరువు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువు వాగు ఉధృతంగా ప్రవహించడంతో నామాలపాడు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో మహబూబాబాద్-ఇల్లెందు మధ్య రాకపోకలు ఆగిపోయి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.