చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
MDK: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.