ప్రభుత్వ కళాశాలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన
KDP: వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల ద్వారా యోగా సాధన ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు అధికారి డా.ఓబుల్ రెడ్డి తెలిపారు. మంగళవారం తంగేడుపల్లి ప్రాధమిక పాఠశాలలో శిబిరాల ముగింపు కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకుడు రామకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులకు పలు ఉపయోగకరమైన దిశానిర్దేశాలు అందించారు.