కాలు జారి పడిన పాక్ ఉప ప్రధాని

కాలు జారి పడిన పాక్ ఉప ప్రధాని

పాక్ ఉపప్రధాని ఇషాక్ దార్‌కు చేదు అనుభవం ఎదురైంది. US-ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇస్లామాబాద్ చేరుకున్న ఈజిప్ట్ విదేశాంగ మంత్రి అబ్దెలాటీకి స్వాగతం పలికేందుకు వెళ్తుండగా ఇషాక్ కాలు జారి పడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను పైకి లేపారు. అయితే ఈ ఘటనలో ఇషాక్‌కు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.