రేపు యధావిధిగా PGRS: కలెక్టర్
W.G: భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు.